Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమవివాహం చేసుకున్న పటిదార్ నేత హార్దిక్ పటేల్

  • కింజల్ పారిఖ్ ను పెళ్లాడిన హార్దిక్ పటేల్
  • ఇంటిదైవం మేల్దీమాత గుడిలో నిరాడంబరంగా వివాహం
  • అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం
పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను వివాహం చేసుకున్నాడు. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా దిగ్సార్ గ్రామంలో ఉన్న హార్దిక్ ఇంటి దైవం మేల్దీమాత గుడిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

కింజల్ కుటుంబం సూరత్ లో స్థిరపడింది. హార్దిక్ స్వగ్రామమైన చందన్ నగరి సూరత్ కు కొద్ది దూరంలోనే ఉంటుంది. కింజల్ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ పెద్దలు... హార్ధిక్ పటేల్ లాజ్ పూర్ జైల్లో ఉన్నప్పుడే నిశ్చితార్థాన్ని ప్రకటించారు. 
hardhik pandya
marriage
patidar

More Telugu News